చిటపట చినుకులు పడుతూ వుంటే (ఆత్మబలం)

కవనం కిళాంబి వెంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: ఆత్మబలం
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్


చిటపట చినుకులు పడుతూ వుంటే
చెలికాడే సరసన వుంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి

ఉరుములు పెళపెళ ఉరుముతు వుంటే
మెరుపులు తళతళ మెరుస్తు వుంటే
మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి

కారుమబ్బులు కమ్ముతు వుంటే
కళ్ళకు ఎవరూ కనబడకుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి

చలి చలిగా గిలి వేస్తుంటే
గిలిగింతలు పెడుతూ వుంటే
చెలి గుండియలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి


విశ్లేషణ

గుండియ = గుండె, heart


సంవత్సరం: 1964
రసం: సరసం
అక్షరం: చ
గుర్తింపు:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s