కవనం: పింగళి నాగేంద్రరావు
చిత్రం: మిస్సమ్మ
గానం: పులపాక సుశీల, అయిమల మన్మథరాజు రాజా
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
బృందావనమది అందరిది, గోవిందుడు అందరివాడేలే
ఎందుకె రాధా ఈసునసూయలు, అందములందరి ఆనందములే
పిల్లనగ్రోవిని పిలుపునువింటే ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాసక్రీడల రమణుని గాంచిన, ఆసలు మోసులు వేయవటే
ఎందుకె రాధా ఈసునసూయలు, అందములందరి ఆనందములే
విశ్లేషణ
ఈసునసూయలు = ఈర్ష్య, అసూయ, envy, jealousy
ఉల్లము = హృదయము, the heart
ఝల్లు = thrill
ఆసలు = ఆశలు, desires
మోసులు = మొలకలు, sprouts
సంవత్సరం: 1955
రసం: ప్రేమ
అక్షరం: బ
గుర్తింపు: