కవనం: వేమూరి విశ్వేశ్వర్ (విశ్వ)
చిత్రం: c/o కంచరపాలెం
గానం: అనురాగ్ కులకర్ణి, దామిని
సంగీతం: స్వీకార్ అగస్తి
ఆశ పాశం బందీ చేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం చేరేలోగానే ఏతీరౌనో
చేరువైన చేదు దూరాలే
తోడౌతూనే వీడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఏదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోన.. సాగేనా
ఏ లేలేలేలో కల్లోలం నీలోకంలో
లోలో లోలోతుల్లో ఏ లీలో ఎద కొలనుల్లో
నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే
నీ గమ్యం గందరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా
ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ మలుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో
సిగ్గు ముల్లుగప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే
తెలియకనే సాగే కధనం
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టి పోతుంటే
కంచికి నీ కధలే దూరం
నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా
ఆటు పోటు గుండె మాటుల్లోన.. ఉంటున్నా
విశ్లేషణ
పాశం = తాడు, a cord
పల్లటిల్లు = చలించి పోవు, to move
హేతువు = కారణం, reason
క్రీనీడ = shadow
సంవత్సరం: 2018
రసం: వేదాంతం
అక్షరం: అ
గుర్తింపు: