కవనం: దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
చిత్రం: మేఘసందేశం
గానం: పులపాక సుశీల
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
ఆకులో ఆకునై
పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై
నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడి చేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తరులెక్కి యెల నీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
విశ్లేషణ
చేటి = తేనెటీగ, honey bee
విడి చేడే =
తరులు = చెట్లు, trees
యెల నీలి =
చదలు = ఆకాశం, sky
జలదం = మబ్బు, cloud
నిగ్గు = కాంతి, brightness
ఏకతము = ఒంటరిగా, alone
సంవత్సరం: 1982
రసం: తన్మయం, ప్రకృతి
అక్షరం: అ
గుర్తింపు: నంది పురస్కారం