కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: మేఘసందేశం
గానం: కట్టస్సెరి జోసెఫ్ ఏసుదాస్ (జేసుదాస్)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహవేదన
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి లేఖల మెరుపులతో రుధిర బాష్ప జలధారలతో
విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన
విశ్లేషణ
వానకారు = వానాకాలం, rainy season
ఎడద = హృదయం, heart
కడిమి = చెట్టు, tree
ఉలిపిరి = పలుచని, sparse
నిశీధి = చీకటి రాత్రి, dark night
నివురు = నిప్పు పైని బూడిద, ashes covering live coal
రుధిర = ఎరుపు, red
బాష్పము = కన్నీరు, tears
సంవత్సరం: 1982
రసం: విరహం
అక్షరం: అ
గుర్తింపు: