ఆకాశాన సూర్యుడుండడు (సుందరకాండ)

కవనం వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: సుందరకాండ
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి


ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
మజిలీ మూడునాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలోనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా
వికసించాలే ఇక రోజాలా
కన్నీటిమీద నావ సాగనేల

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్తపూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింతపడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడక
పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ

నీ సిగపాయల నీలపుఛాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధిరాత కన్న లేదు వింత పాట


విశ్లేషణ

సందె = సంధ్య, dusk
మజిలీ = halt in a journey
నవమల్లిక = మల్లెపువ్వు, jasmine flower
మధుమాసం = చైత్రమాసం, beginning of spring
సిగపాయ = జుట్టు, a small bunch of hair
మైనా = చిలుక, parrot


సంవత్సరం: 1992
రసం: కరుణ
అక్షరం: అ
గుర్తింపు: నంది పురస్కారం, మనస్విని పురస్కారం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: