కవనం: దాశరథి కృష్ణమాచార్య
చిత్రం:
గానం:
సంగీతం:
ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో
భూగోళం పుట్టకకోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
శ్రమజీవుల పచ్చినెత్తురులు తాగిన ధనవంతులెందరో
అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
అణగారిన అగ్నిపర్వతం కనిపెంచిన లావా ఎంతో
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో
పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో
కులమతాల సుడిగుండంలో బలియైన పవిత్రులెందరో
భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాళ్ళకో
మానవకళ్యాణం కోసం పణమెత్తిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళనృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల దౌర్జన్యాలకు ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో
విశ్లేషణ
బడబానలం = ఆర్పనలవి గాని అగ్ని, inextinguishable flame
పణం = వెల, price
సంవత్సరం:
రసం: విప్లవం
అక్షరం: అ
గుర్తింపు: