ఏం సందేహం లేదు (ఊహలు గుసగుసలాడే)

కవనం చేగొండి అనంత శ్రీరాం
చిత్రం: ఊహలు గుసగుసలాడే
గానం: కోడూరి కళ్యాణ్, ఉపద్రష్ట సునీత
సంగీతం: కోడూరి కళ్యాణ్ (కళ్యాణి మాలిక్)


ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది

నిమిషము నేలమీద నిలువని కాలిలాగ మది నిను చేరుతోందే చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు మది నిను చేరుతుందే చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నాగానీ ఏమైనా ఐపోనీ ఏం ఫర్వాలేదన్నావా
అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండెగనుకా
అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌనలేఖ


విశ్లేషణ


సంవత్సరం: 2014
రసం: ప్రేమ
అక్షరం: ఎ
గుర్తింపు:

Leave a comment