ఏ దివిలో విరిసిన (కన్నెవయసు)

కవనం: దాశరథి కృష్ణమాచార్య
చిత్రం: కన్నెవయసు
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యనారాయణ శాస్త్రి (సత్యం)


ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే

నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెలకాంతి నింపెనే

పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకువీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే


విశ్లేషణ


సంవత్సరం: 1973
రసం: ప్రేమ
అక్షరం: ఎ
గుర్తింపు:

Leave a comment