కవనం: ఇందుకూరి రామకృష్ణంరాజు (రాజశ్రీ)
చిత్రం: దళపతి
గానం: స్వర్ణలత
సంగీతం: ఇళయరాజా
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధ
ప్రేమ పొంగులా పసిడి వెన్నెలే వాడిపోయెను కాదా
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో .. పాపం రాధ
విశ్లేషణ
సంవత్సరం: 1991
రసం: విరహం