తరలిరాదా తనే వసంతం (రుద్రవీణ)

కవనం చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: రుద్రవీణ
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా


తరలిరాదా తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా

వెన్నెలదీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి, అందరికోసం అందును కాదా
ప్రతీమదిని లేపే ప్రభాతరాగం, పదే పదే చూపే ప్రధానమార్గం
ఏదీ సొంతంకోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగని గమనము కద

బ్రతుకున లేని శృతి కలదా, ఎదసడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా, మారే ఏరే పాడే మరో పదం రాదా
మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదు కద


విశ్లేషణ

ప్రభాతము = వేకువ, the dawn


సంవత్సరం: 1988
రసం: సంగీతం
అక్షరం: త
గుర్తింపు: