కవనం: భాగవతుల సదాశివశంకర శాస్త్రి (ఆరుద్ర)
చిత్రం: పెళ్లి పుస్తకం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్
శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
తలమీద చెయ్యివేసి ఒట్టు పెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా
సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని
ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మనికి నింపుకో
విశ్లేషణ
శ్రీరస్తు = శ్రీః అస్తు, సిరి కలుగుగాక
సన్నికల్లు = చిన్న గుండ్రాయి
మెట్టు = అడుగు పెట్టు
మనికి = జీవితం
సంవత్సరం: 1991