సీతారాముల కళ్యాణము చూతము రారండి (సీతారామ కళ్యాణం)

కవనం సముద్రాల రాఘవాచార్య
చిత్రం: సీతారామ కళ్యాణం
గానం: పులపాక సుశీల
సంగీతం: గాలి పెంచల నరసింహారావు


సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి

సిరికళ్యాణపు బొట్టునుబెట్టి
మణిబాసికమును నుదుటనుగట్టి
పారాణిని పాదాలకుబెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణము చూతము రారండి

సంపగినూనెను కురులను దువ్వి
సొంపుగ కస్తూరినామము దీర్చి
చెంప జవ్వాజి చుక్కనుబెట్టి
పెళ్లికొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతము రారండి

జానకి దోసిట కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరసిన సీతారాముల కళ్యాణము చూతము రారండి


విశ్లేషణ

జవ్వాజి = సుగంధ ద్రవ్యము, civet perfume
ఇరవు =స్థిరము, firm


సంవత్సరం: 1961
రసం: కళ్యాణం
అక్షరం: స
గుర్తింపు:

Leave a comment