కవనం: కిలంబి వేంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: త్రిశూలం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వేంకటాచలం మహదేవన్
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానేకాను
తోడనుకో నీ వాడనుకో
నేనేంటి నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
నీకేంటి నువు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి
తప్పు నాదికాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
అది కథే కదా
మన కథ నిజం కాదా
ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
అది నువ్వే కదా
నేనూ నువ్వే కాదా
విశ్లేషణ
సంవత్సరం: 1982
రసం: ఆత్మీయ
అక్షరం: ర
గుర్తింపు: