ప్రియతమా నా హృదయమా (ప్రేమ)

కవనం కిలంబి వెంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: ప్రేమ
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా


ప్రియతమా నా హృదయమా 
ప్రేమకే ప్రతిరూపమా 
నా గుండెలో నిండిన గానమా 
నను మనిషిగా మార్చిన త్యాగమా 
శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి 
వలపన్న తీపి తొలిసారి చూపి 
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై 
శృతి, లయ లాగ జత చేరినావు 
నువులేని నన్ను వూహించలేను 
నా వేదనంతా నివేదించలేను 
అమరం, అఖిలం మన ప్రేమ
నీ పెదవిపైన వెలుగారనీకు 
నీ కనులలోన తడి చేరనీకు 
నీ కన్నీటిచుక్కే మున్నీరు నాకు 
అది వెల్లువల్లే నను ముంచనీకు 
ఏ కారుమబ్బు యెటు కమ్ముకున్నా 
మహాసాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోన యెడబాటు లేదు 
పది జన్మలైనా ముడే వీడిపోదు 
అమరం, అఖిలం మన ప్రేమ 

విశ్లేషణ

అఖిలం = సమస్తం, whole
మున్నీరు =సముద్రం, the sea


సంవత్సరం: 1989
రసం: బాధ
అక్షరం: ప
గుర్తింపు:

Leave a comment