కవనం: కిళాంబి వేంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: అభినందన
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
సంవత్సరం: 1987
ప్రేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీరసాగర మథనం
మింగినాను హలాహలం
ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్లని ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము
నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం
నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి
నా రేపటినే మరిచేపోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగగానము
విశ్లేషణ