కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం:గాయం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ)
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ యెవ్వడు యేమైపోనీ మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణమార్పిందా రావణకాష్టం కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా అడవినీతి మారిందా యెన్ని యుగాలైనా వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా? బలవంతులె బ్రతకాలనె సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
విశ్లేషణ
సంవత్సరం: 1993
రసం: చైతన్యం
అక్షరం: న
గుర్తింపు: