నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ)

కవనం సింగిరెడ్డి నారాయణరెడ్డి
చిత్రం: గులేబకావళి కథ
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల
సంగీతం: జోసెఫ్, విజయ కృష్ణమూర్తి


నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం


విశ్లేషణ

గులేబకావళి = ఒక ప్రత్యేకమైన పువ్వు, a special flower
నెఱజాణ = నేర్పరి, wit
ఇగిరిపోవు = ఎండిపోవు, dry up


సంవత్సరం: 1962
రసం: ప్రేమ
అక్షరం: న
గుర్తింపు:

Leave a comment