ముత్యమంత పసుపు (ముత్యాలముగ్గు)

కవనం భాగవతుల సదాశివశంకర శాస్త్రి (ఆరుద్ర)
చిత్రం: ముత్యాలముగ్గు
గానం: పులిపాక సుశీల
సంగీతం: కృష్ణన్‌కోయిల్ వేంకటాచలం మహదేవన్


ముత్యమంత పసుపు ముఖమెంతొ ఛాయ
ముతైదు కుంకుమ బతుకంతా ఛాయ
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్లలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ

ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికేవారి అరచేతనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
దినదినము ముగ్గున్న లోగిళ్లనుండు

కోటలో తులశమ్మ కొలువున్నతీరు
కోరి కొలిచేవారి కొంగుబంగారు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవళ్లు

మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలిపూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం


విశ్లేషణ

చాన = స్త్రీ, a woman


సంవత్సరం: 1975
రసం: సాంప్రదాయం
అక్షరం: మ
గుర్తింపు:

Leave a comment