కవనం: కనుకుంట్ల సుభాష్ (చంద్రబోస్)
చిత్రం: నా ఆటోగ్రాఫ్
గానం: క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందని దిగులుపడకు నేస్తమా
దరికిచేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వులపంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగేచెందక కృషిచేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనందనిధి ఉన్నది
కష్టాలవారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది
చెమటనీరు చిందగా నుదుటిరాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడిగట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధిసైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
విశ్లేషణ
ఒదిగి ఉండు = be humble
తరియించగా = be delightful
ఆది = మొదలు, beginning
సంవత్సరం: 2004
రసం: ధైర్యం
అక్షరం: మ
గుర్తింపు: