మౌనమె నీ భాష (గుప్పెడు మనసు)

కవనం కిళాంబి వేంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: గుప్పెడు మనసు
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
సంగీతం: మనయంగాత్ సుబ్రహ్మణియన్ విశ్వనాథన్


మౌనమె నీ భాష ఓ మూగమనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా, తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

కోర్కెల సెల నీవు, కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దెయ్యానివే
లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు


విశ్లేషణ

వగచు = దుఃఖించు, to regret
సెల = సెలయేరు, the hill stream
కూరిమి = చెలిమి, friendship
పొగిలించు = to grieve


సంవత్సరం: 1979
రసం: తత్వం
అక్షరం: గ
గుర్తింపు:

%d bloggers like this: