కొమ్మకొమ్మకో సన్నాయి (గోరింటాకు)

కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: గోరింటాకు
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వేంకటాచలం మహదేవన్


కొమ్మకొమ్మకో సన్నాయి కోటిరాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మకొమ్మకో సన్నాయి కోటిరాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసు మాటకందనినాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం

కన్నెవయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడేముడి ఎవరితోపడి పడవ పయనం సాగునో మరి


విశ్లేషణ


సంవత్సరం: 1979
రసం: ప్రణయం
అక్షరం: క
గుర్తింపు:

%d bloggers like this: