కవనం: సముద్రాల రాఘవాచార్య
చిత్రం: దేవదాసు
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
సంగీతం: C. R. సుబ్బరామన్
సంవత్సరం: 1953
జగమే మాయ, బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా
ఈ వింతేనయా
కలిమిలేములు, కష్టసుఖాలు
కావడిలో కుండలని భయమేలోయి
కావడి కొయ్యేనోయ్, కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి
ఈ వింతేనోయి
ఆశామోహముల దరి రానీకోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయ్
బ్రహ్మానందమోయ్
విశ్లేషణ
కలిమిలేములు = కలిమి + లేమి = wealth and poverty
కావడి = a sort of yoke or pole (generally of bamboo) with a sling attached to each end, placed upon the shoulder for carrying burdens
మన్ను = మట్టి, dirt
ఎరుక = జ్ఞానం, knowledge