చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం)

కవనం చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: శుభలగ్నం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: సట్టి వెంకట కృష్ణారెడ్డి


చిలకా ఏ తోడు లేక
ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

మంగళసూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయ్యి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక

గోరింక ఏదే చిలకా.. లేదింక

బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే

కొండంత అండే నీకు లేదింక

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుదెరిచాక తీరం కనబడదే ఇంక

మంగళసూత్రం అంతటి చవకా, సిరివుందని వెలగడతావా
బేరం ఏమిచ్చిందమ్మా నూరేళ్ళ భారం తప్ప


విశ్లేషణ

హలాహలం = విషం, poison


సంవత్సరం: 1994
రసం: కరుణ
అక్షరం: చ
గుర్తింపు: నంది పురస్కారం

Leave a comment