చీకటితో వెలుగే చెప్పెను (నేనున్నాను)

కవనం కనుకుంట్ల సుభాష్ (చంద్రబోస్)
చిత్రం:నేనున్నాను
గానం: కోడూరి మరకతమణి కీరవాణి, ఉపద్రష్ట సునీత
సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి


చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి యెదగాలని 
తరిమేవాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్లాలని 
కన్నులనీటిని కలలసాగుకై వాడుకోవాలని 
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని 
గుండెతో ధైర్యం చెప్పెను 
చూపుతో మార్గం చెప్పెను 
అడుగుతో గమ్యం చెప్పెను.. నేనున్నానని
ఎవ్వరులేని ఒంటరి జీవికి తోడు దొరికిందని 
అందరువున్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని 
జన్మకు యెరుగని అనురాగాన్ని పంచుతున్నావని 
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని 
శ్వాసతో శ్వాసే చెప్పెను 
మనసుతో మనసే చెప్పెను 
ప్రశ్నతో బదులే చెప్పెను.. నేనున్నానని

విశ్లేషణ


సంవత్సరం: 2004
రసం: ప్రేరణ
అక్షరం: చ
గుర్తింపు: నంది పురస్కారం

Leave a comment