అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి)

కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం
: నువ్వే కావాలి
గానం: P. జయచంద్రన్, క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
సంగీతం: సాలూరి కోటేశ్వరరావు (కోటి)
సంవత్సరం: 2000


అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి
నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి
అనురాగాల మువ్వై మోగాలి

ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా
నీ చెలిమే చిటికేసి నను పిలిచె నీకేసి
నువు చెవిలో చెప్పే ఊసులకోసం
నేనొచ్చేశా పరుగులు తీసి

చుక్కల లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నాకోసం వేచి
సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే
నా చిలక నువ్వే కావాలి
నా రాచిలక నవ్వే కావాలి


విశ్లేషణ

గువ్వ = పావురం, pigeon
మువ్వ = గజ్జె, an anklet with small bells worn by traditional dancers


Leave a comment