ఆడుతు పాడుతు పనిజేస్తుంటే (తోడికోడళ్లు)

కవనం కొసరాజు రాఘవయ్య చౌదరి
చిత్రం: తోడికోడళ్లు
గానం: ఘంటసాల వేంకటేశ్వరరావు, పులపాక సుశీల
సంగీతం: మద్దూరి వేణుగోపాల్ (మాస్టర్ వేణు)


ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయిగలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది

ఒంపులు తిరిగి వయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటె
నా మనసు ఝల్లుమంటున్నది

తీరని కోరికలూరింపంగా ఓరకంట నను చూస్తూ వుంటే
చిలిపి నవ్వులు చిందులు తొక్కి
సిగ్గు ముంచుకొస్తున్నది
నునుసిగ్గు ముంచుకొస్తున్నది

చెదరిజారిన కుంకుమరేఖలు పెదవులపైన మెరుస్తు వుంటే
తీయని తలపులు నాలో ఏమో
తికమకజేస్తూ వున్నవి
అహ తికమకజేస్తూ వున్నవి

మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
పాట పాడుతుంటే
నా మది పరవశమైపోతున్నది


విశ్లేషణ

గూడవేయు = water fields with a triangular basket


సంవత్సరం: 1957
రసం: సరసం
అక్షరం: అ
గుర్తింపు:

%d bloggers like this: