మా తెలుగు తల్లికి

కవనం: శంకరంబాడి సుందరాచారి
చిత్రం
: దీన బంధు [విడుదలైన చిత్రంలో ఈ పాట లేదు]
గానం: టంగుటూరి సూర్యకుమారి
సంగీతం: R. సుదర్శనం


మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు నాతల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ

అమరావతి గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి వుండేదాక

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం

జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!!


విశ్లేషణ

తారాడు = తిరుగాడు, to move about
నిఖిలమై = సమస్తమై, అంతటా తానై, entirely
ధీయుక్తి = తెలివి, intelligence


సంవత్సరం: 1942
రసం
: భక్తి
అక్షరం: మ
గుర్తింపు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం

Leave a comment