గోవింద హరి గోవింద !
వేంకటరమణ గోవింద !!
శ్రీ శ్రీనివాస గోవింద
శ్రీ వేంకటేశ గోవింద !
భక్తవత్సల గోవింద
భాగవతప్రియ గోవింద !!
నిత్యనిర్మల గోవింద
నీలమేఘశ్యామ గోవింద !
పురాణపురుష గోవింద
పుండరీకాక్ష గోవింద !!
నందనందన గోవింద
నవనీతచోర గోవింద !
పశుపాలక శ్రీ గోవింద
పాపవిమోచక గోవింద !!
దుష్టసంహార గోవింద
దురితనివారక గోవింద !
శిష్టపాలక గోవింద
కష్టనివారక గోవింద !!
వజ్రమకుటధర గోవింద
వరాహమూర్తి గోవింద !
గోపీజనప్రియ గోవింద
గోవర్ధనధర గోవింద !!
దశరథనందన గోవింద
దశముఖమర్దన గోవింద !
పక్షివాహన గోవింద
పాండవప్రియ గోవింద !!
మత్స్యకూర్మధర గోవింద
మధుసూదన హరి గోవింద !
వరాహనృసింహ గోవింద
వామనభార్గవ గోవింద !!
బలరామానుజ గోవింద
బౌద్ధ కల్కిధర గోవింద !
వేణుగానప్రియ గోవింద
వేంకటరమణ గోవింద !!
సీతానాయక గోవింద
శ్రితపరిపాలక గోవింద !
దయార్ద్రహృదయ గోవింద
ధర్మస్థాపక గోవింద !!
అనాథరక్షక గోవింద
ఆపద్బాంధవ గోవింద !
శరణాగతనర గోవింద
కరుణాసాగర గోవింద !!
కమలదళాక్ష గోవింద
కామితఫలద గోవింద !
పాపవినాశక గోవింద
పాహిమురారి గోవింద !!
శ్రీ ముద్రాంకిత గోవింద
శ్రీ వత్సాంకిత గోవింద !
ధరణీనాయక గోవింద
దినకరతేజ గోవింద !!
పద్మావతీప్రియ గోవింద
ప్రసన్నమూర్తి గోవింద !
అభయహస్తధర గోవింద
ఉభయవిభూదిత గోవింద !!
శంఖచక్రధర గోవింద
శారంగగదాధర గోవింద !
విరాజతీర్ధస్థ గోవింద
విరోధిమర్దన గోవింద !!
సాలగ్రామధర గోవింద
సహస్రనామ గోవింద !
లక్ష్మీవల్లభ గోవింద
లక్ష్మణాగ్రజ గోవింద !!
కస్తూరితిలక గోవింద
కాంచనాంబర గోవింద !
గరుడవాహన గోవింద
గజరాజరక్షక గోవింద !!
వానరసేవిత గోవింద
వారధిబంధన గోవింద !
మోహనరూప గోవింద
మోక్షప్రదాత గోవింద !!
వజ్రకవచధర గోవింద
వసుదేవతనయ గోవింద !
ప్రత్యక్షదేవ గోవింద
పరమదయాకర గోవింద !!
కౌస్తుభశోభిత గోవింద
కుమారార్చిత గోవింద !
వైజయంతిధర గోవింద
వైభవమూర్తి గోవింద !!
బిల్వపత్రార్చిత గోవింద
భిక్షుక సంస్తుత గోవింద !
బ్రహ్మాండరూప గోవింద
భక్తరక్షక గోవింద !!
నిత్యకల్యాణ గోవింద
నీరజనాభ గోవింద !
రఘుకులనందన గోవింద
రంగనాథసఖ గోవింద !!
హాతీరామప్రియ గోవింద
హరి సర్వోత్తమ గోవింద !
జగత్స్వరూప గోవింద
జనహృన్నివాస గోవింద !!
రామానుజనుత గోవింద
రత్నమకుటధర గోవింద !
భాష్యకారప్రియ గోవింద
భాగ్యప్రదాత గోవింద !!
అనంతసేవిత గోవింద
ఆశ్రితవత్సల గోవింద !
నిత్యశుభప్రద గోవింద
నిఖిలలోకేశ గోవింద !!
ఆనందరూప గోవింద
ఆద్యంతరహిత గోవింద !
ఇహపర దాయక గోవింద
ఇభరాజ రక్షక గోవింద !!
పద్మదయాళో గోవింద
పద్మనాభహరి గోవింద !
తిరుమలవాస గోవింద
తులసీవనమాల గోవింద !!
విఖనసార్చిత గోవింద
వైష్ణవతేజ గోవింద !
శేషశాయిని గోవింద
శేషాద్రినిలయ గోవింద !!
గోవింద హరి గోవింద
వేంకటరమణ గోవింద !
గోవింద హరి గోవింద
గోకులనందన గోవింద !!