ఓంకార నాదాను (శంకరాభరణం)

కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం
: శంకరాభరణం (1979)
గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, S. జానకి
సంగీతం: K.V. మహదేవన్


ఓం
ఓం
ఓంకార నాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణము..        \\మళ్ళీ\\
శంకరాభరణము..
శంకర గళ నిగళము.. శ్రీహరి పద కమలము..        \\మళ్ళీ\\
రాగరత్న మాలికా తరళము, శంకరాభరణము..

శారద వీణా.. ఆ..
శారద వీణా, రాగ చంద్రికా పులకిత శారద రాత్రము..        \\మళ్ళీ\\
నారద, నీరద, మహతీ నినాద, గమకిత శ్రావణ గీతము..        \\మళ్ళీ\\
రసికులకనురాగమై! రసగంగలో తానమై..        \\మళ్ళీ\\
పల్లవించు, సామ, వేద, మంత్రము శంకరాభరణము.. శంకరాభరణము!

అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి, గానమె సోపానము..        \\మళ్ళీ\\
సత్వ సాధనకు, సత్య శోధనకు సంగీతమే ప్రాణము..        \\మళ్ళీ\\
త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై..        \\మళ్ళీ\\
ముక్తి నొసగు భక్తి యోగ మార్గము
మృతియె లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము..

ఓంకార నాదాను సంధానమౌ గానమే.. శంకరాభరణము..


విశ్లేషణ

అనుసంధానమౌ = స్మరించు, reciting
నిగళము
= గొలుసు, chain
మాలికా
= దండ, garland
తరళము
= ప్రకాశించునది,  shining
శారద రాత్రము = వెన్నెల రాత్రి, moonlit night
నీరద
= మేఘం, cloud
మహతీ
= నారదుని వీణ, musical instrument played by Naarada maharshi
గమకిత = గమకాలు నిండిన, filled with nuances of musical notes
తానమై
= స్నానము చేసి, bathe
సత్వ
= సత్వ గుణము, quality of excellence
సుధాలాప
  = అమృతం లాంటి  ఆలాపము, divine song


Advertisements