విధాత తలపున (సిరివెన్నెల)

కవనం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

చిత్రం: సిరివెన్నెల (1986)

గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

సంగీతం: క్రిష్ణన్ కోయిల్  వేంకటాచలం మహదేవన్


విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవన వేదం.. ఓం

ప్రాణనాడులకు, స్పందననొసగిన, ఆది ప్రణవనాదం.. ఓం

కనుల కొలనులో ప్రతిబింబించిన, విశ్వరూప విన్యాసం

యెదకనుమలలో.. ప్రతిధ్వనించిన, విరించి విపంచి, గానం

 

సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది

సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది

నే పాడిన జీవన గీతం, ఈ గీతం

విరించినై విరచించితిని, ఈ కవనం

విపంచినై వినిపించితిని, ఈ గీతం

 

ప్రార్దిశ వీణియ పైన, దినకర మయూహ తంత్రుల పైన

జాగృత విహంగ తతులే, వినీల గగనపు వేదిక పైన

ప్రార్దిశ వీణియ పైన, దినకర మయూహ తంత్రుల పైన

జాగృత విహంగ తతులే, వినీల గగనపు వేదిక పైన

పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా

విశ్వకావ్యమునకిది భాష్యముగా

విరించినై.. విరచించితిని ఈ కవనం

విపంచినై వినిపించితిని ఈ గీతం

 

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా

సాగిన సృష్టి విలాసమునే

విరించినై.. విరచించితిని ఈ కవనం

విపంచినై వినిపించితిని ఈ గీతం

 

నా ఉచ్చ్వాసం కవనం, నా నిశ్వాసం గానం

నా ఉచ్చ్వాసం కవనం, నా నిశ్వాసం గానం

సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది

నే పాడిన జీవన గీతం.. ఈ గీతం

 


 

విశ్లేషణ

సామంతము = గర్వము, proud