రావోయి చందమామా (మిస్సమ్మ)

కవనం: పింగళి నాగేంద్రరావు

చిత్రం: మిస్సమ్మ (1955)

గానం: పోరయతు లీల, యేమల మన్మధరాజు రాజా

సంగీతం: సాలూరు రాజేశ్వరరావు


రావోయి చందమామా

మా వింత గాధ వినుమా.. రావోయి చందమామా

మా వింత గాధ వినుమా.. రావోయి చందమామా

సామంతముగల సతికీ.. ధీమంతుడనగు పతినోయ్

సామంతముగల సతికీ.. ధీమంతుడనగు పతినోయ్

సతిపతి పోరే బలమై.. సతమత మాయెను బ్రతుకే

 

రావోయి చందమామా

మా వింత గాధ వినుమా.. రావోయి చందమామా

మా వింత గాధ వినుమా ..రావోయి చందమామా

ప్రతినలు బలికిన పతితో.. బ్రతుకగ వచ్చిన సతినోయ్

ప్రతినలు బలికిన పతితో.. బ్రతుకగ వచ్చిన సతినోయ్

మాటలు బూటకమాయే.. నటనలు నేర్చెను చాలా

 

రావోయి చందమామా

మా వింత గాధ వినుమా ..రావోయి చందమామా

తన మతమేమో తనదీ.. మనమతమసలే పడదోయ్

తన మతమేమో తనదీ.. మనమతమసలే పడదోయ్

మనమూ మనదను మాటే.. అననీయదు తాననదోయ్

 

రావోయి చందమామా

మా వింత గాధ వినుమా ..రావోయి చందమామా

నాతో తగవులు పడుటే.. అతనికి ముచ్చటలేవో

నాతో తగవులు పడుటే.. అతనికి ముచ్చటలేవో

ఈవిధి కాపురమెటులో.. నీవొక కంటను గనుమా

 

రావోయి చందమామా

మా వింత గాధ వినుమా.. రావోయి చందమామా

 


 

విశ్లేషణ

సామంతము = గర్వము, proud


 

 

Advertisements